అమెరికాలో హైదరాబాదీలఅరెస్టు
హైదరాబాద్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడిలో కేసులో అక్కడి పోలీసులుఅరెస్టు చేసినవారిలో ఇద్దరు హైదరాబాద్ పాతబస్తీవాసులు ఉన్నారు. దీంతో హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం ప్రాంతంలో గల షాగంజ్, సిప్లిగంజ్‌ల్లో ఆవేదన, ఆందోళన కనిపించింది.పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులుఅరెస్టు చేసిన ఇద్దరి హైదరాబాదీల ఇళ్లు ఈ ప్రాంతాల్లో వుండడమే దీనికి కారణం.
అమెరికాలోని న్యూజెర్సీ నుంచి టెక్సాస్‌కు డల్లాస్ ట్రెయిన్‌లో ప్రయాణమైన హైదరాబాదీలు అయూబ్ అలీఖాన్‌ను, మహ్మద్ జావీద్ అజ్మత్లను ఎఫ్‌బిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ చెకింగ్‌లో భాగంగారైలును ఆపి తనిఖీలు నిర్వహిస్తుండగా అలీఖాన్, అజ్మత్ దొరికిపోయారు. గతవారం న్యూయార్క్, వాషింగ్టన్‌లలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో ఉపయోగించిన బాక్స్ కట్టర్లు వుండడం, చట్టవిరుద్ధంగా అమెరికాలో వుంటున్నట్లు తేలడంతో కుట్రలోవీరు కూడా పాలు పంచుకొని వుండవచ్చుననే అనుమానంతోవీరిని కస్టడీలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications