పాక్ విషయంలోజాగ్రత్తః భారత్
న్యూఢిల్లీః టెర్రరిజానికి వ్యతిరేకంగాప్రపంచదేశాలు ఎక్కుపెట్టిన యుద్ధానికిపాకిస్తాన్ సహకారాన్ని తీసుకునే విషయంలోఅమెరికా అప్రమత్తంగా వ్యవహరించాలనిభారత్ హెచ్చరించింది. పాకిస్తానే స్వయంగాటెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న విషయం ఈ సందర్భంగాదృష్టిలో వుంచుకోవాలని భారత్ కోరింది.
భారత పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రమోద్ మహాజన్ బుధవారంనాడు ఢిల్లీలోని అమెరికా రాయబారి రాబర్ట్‌బ్లాక్‌విల్‌ను కలుసుకుని చర్చించారు. అమెరికాటెర్రరిజంపై పోరాడే విషయంలో సీరియస్‌గావుంటే, పాకిస్తాన్ కూడా ఉపఖండంలోటెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్నదన్న విషయందృష్టిలో వుంచుకోవాలని మహాజన్ కోరారు.టెర్రరిజంపై పోరు విషయంలో పాకిస్తాన్‌తమకు ఏలాంటి షరతులు విధించలేదనిబ్లాక్‌విల్ స్పష్టం చేశారు. ఇదిలా వుండగాబ్లాక్ విల్ ఢిల్లీలో సిక్కులతో పాటు గురుద్వారానుసందర్శించి, అమెరికాలో సిక్కుల రక్షణకు అన్ని చర్యలుతీసుకుంటామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications