ఇక యుద్ధమే మార్గాంతరం
న్యూయార్క్‌ః అఎn్గానిస్తాన్‌లో తాలిబన్‌ప్రభుత్వం తమ మాటవిని ఒసామా బిన్‌లాడెన్‌ను అప్పగించే అవకాశాలుకనిపించకపోవడంతో అమెరికా యుద్ధ సన్నాహాలు
ముమ్మరం చేసింది. అరేబియా సముద్రంఒమన్ తీర జలాల్లో సుమారు పాతిక యుద్ధనౌకలనుఅమెరికా మొహరించింది.ఈ నౌకల్లో బ్రిటన్,ఫ్రాన్స్, అమెరికాకు చెందిన యుద్ధనౌకలువున్నాయి. పాకిస్తాన్ రేవు ఒర్మరాకు 150 నాటికల్‌మైళ్ల దూరంలోఈ నౌకలను నిలిపారు.
మరోవైపుపదాతి దళాలు పాకిస్తాన్‌లోని స్థావరాలకుచేరినట్టుగా చెబుతున్నారు. జపాన్‌లోనితమ అతిపెద్ద వైమానిక స్థావరం వద్దకూడా ఎయిర్‌ఫోర్స్‌ను అమెరికా సన్నద్ధంగా వుంచింది.ప్రపంచదేశాల మద్దతును కూడా గట్టింది.బ్రిటన్, ఫ్రాన్స్, ఇండోనేషియా, జర్మనీ అమెరికాకుదన్నుగా నిలుస్తున్నట్టు ప్రకటించాయి. ఫ్రాన్స్‌అధ్యక్షుడు, జర్మనీ, రష్యా విదేశాంగమంత్రులు, ఇండోనేసియా, బ్రిటన్ నేతలుస్వయంగా అమెరికాకు వచ్చి తమ మద్దతును,సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.
మరో వైపు అఎn్గానిస్తాన్ మత ప్రాతిపదికనమద్దతు సంపాదిస్తున్నది. పాకిస్తాన్‌ప్రభుత్వం అమెరికాకు మద్దతుప్రకటించినప్పటికీ అక్కడిమతగురువుల మండలి మాత్రం అమెరికాకువ్యతిరేకంగా జిహాద్ ప్రారంభిచాల్సిందిగాప్రపంచముస్లీంలకు పిలుపునిచ్చింది. అఎn్గాన్‌కుతాము దన్నుగా వుంటామని వారు ప్రకటించారు.అఎn్గాన్‌లో తాలిబన్లు కూడా ఇప్పటికేసమరసన్నాహాలను పూర్తి చేసారు. రష్యా వదిలినఆయుధాలతో దీర్ఘకాలం పాటు పోరాటంకొనసాగించగలమన్న ధీమాతో వారు వున్నారు.విద్యార్ధులు, యువకులను ఆయుధాలు అందుకోవల్సిందిగాఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications