మిద్దె కూలి ఇద్దరు పిల్లల మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఒకమిద్దె కూలి ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ సంఘటన కళ్యాణదుర్గం పట్టణంలో జరిగింది. భారీ వర్షాలకు తడిసిన భవంతి పక్కనే వున్న గుడిసెపై కూలింది. దీంతో గుడిసెలో వున్న ఇద్దరు ఐదారేళ్ల పిల్లలు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.
కరువుతో విలవిలలాడే అనంతపురం జిల్లాలో ఇప్పుడు వరదల ఉధృతి చెప్పతరం కాకుండా వుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల గట్టు తెగిపోయాయి. వరదలకు సామాన్య జన జీవనంఅస్తవ్యస్తమైంది.












Click it and Unblock the Notifications