బల్దియా కోసం బాబు పిలుపు
హైదరాబాద్‌ః హైదరాబాద్ నగరపాలక సంస్థను కైవసం చేసుకోవడానికి ఇప్పటినుంచే హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సన్నాహాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
కోట్లాది రూపాయల వ్యయంతో హైదరాబాద్‌ను ప్రతిష్టాత్మకమైన నగరంగా తీర్చిదిద్దిన ఘనత
తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.
అందువల్ల బల్దియా ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించేలా కృషి చేయాలని ఆయనకోరారు. తెలుగుదేశం కార్యకర్తలకోసం ప్రారంభించిన శిక్షణా శిబిరాన్ని ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ భవన్‌లో శనివారం నాడు ప్రారంభించారు. మూడు నెలలపాటుసాగే ఈ శిక్షణా శిబిరంలో వివిధ జిల్లాల కార్యకర్తలు, వివిధ స్థాయిల్లోని నేతలకు శిక్షణ ఇస్తారు. తొలివిడతగా హైదరాబాద్ జిల్లాలోని ఏడుఅసెంబ్లీ నియోజకవర్గాల్లోని 55 డివిజన్లకు చెందిన ముఖ్యకార్యకర్తల శిక్షణ శనివారం నాడు ప్రారంభమయింది.
పౌర సదుపాయాలు,పేదరిక నిర్మూలన, సమగ్రాభివృద్ధి, ప్రణాళికాబద్దమైన నిర్మాణం వంటి ఏడుఅంశాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం వుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. బల్దియా ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications