రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.విశాఖ జిల్లా గాంధీవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం తిరుపతికి వెళ్లి టాక్సీలో తిరిగివస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
వీరు ప్రయాణిస్తున్న టాక్సీ బోల్తా పడటంతో మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications