భారత్ ను ప్రాధేయపడేది లేదుః ముషారఫ్
ఇస్లామాబాద్‌ః భారత దేశంలో చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధంగా వున్నానని, అయితేఅందుకోసం ఎవరినీ ప్రాధేయపడేది లేదని పాక్ అధ్యక్షుడు జనరల్‌పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. బుధవారం ఇస్లామాబాద్ లో ఆయనవిలేకరులతో మాట్లాడుతూ భారత ప్రధానితో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థాయిలోఅయినా చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత ప్రధానికి చర్చలపై ఆసక్తి లేదు.... అలాంటప్పుడు చర్చలకు రావలసిందిగా నేను ప్రాధేయపడను అని ముషారఫ్ అన్నారు.
రంజాన్ పండుగలోగా ఆఫ్ఘనిస్తాన్ పై జరుపుతున్న దాడులను ముగించాల్సిందిగా అమెరికాను కోరనని ముషారఫ్ స్పష్టం చేశారు. దాడులకు ఓ లక్ష్యం వున్నదని, రంజాన్ లోగా దాడులు ముగించమనడం ద్వంద్వ నీతి అవుతుందని ఆయన అన్నారు. ముస్లింల మనోభావాలను దృష్టిలో వుంచుకొని రంజాన్ లోగా దాడులను ముగిస్తే మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు.
ఆప్ఘనిస్తాన్ నుంచి లక్షలాది మంది శరణార్ధులు తరలి వస్తున్నారని, వారందరినీ పోషించే ఆర్థిక స్థోమత పాకిస్తాన్ కు లేదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ దేశాలు సహాయం చేస్తే సరిహద్దులో పడిగాపులు పడుతున్న ఆప్ఘన్ లుఅందరినీ ఆదుకుంటామని అయన చెప్పారు. ఒకొక్క ఆప్ఘన్ పౌరుడికి ఆశ్రయం కల్పించేందుకు 500 డాలర్ల సాయంఅందించాల్సిందిగా ఆయన కోరారు.












Click it and Unblock the Notifications