భారీగా పెరిగిన కూరగాయల ధరలు - సామాన్యులకు చుక్కలు, ఏవి ఎంత..!!

సామాన్యుల పైన వరుసగా పెరిగిన ధరల ప్రభావం పడుతోంది. పెట్రోల్, వంట గ్యాస్, నూనెల ధరలు ఇప్పటికే పెరిగాయి. రుతుపవనాలు కదలిక లేకపోవటం.. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగటం ఇప్పుడు కూరగాయల పైన ప్రభావం చూపుతోంది. ఒక్క సారిగా తెలుగు రాష్ట్రాల్లో కూరల ధరలు పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ఏకంగా 20 శాతం మేర ధరలు పెంపు భారంగా మారుతోంది. మరో నెల రోజుల వరకు ఈ ధరల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కూరగాయల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. తెలగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు వల్ల దిగుబడి భారీగా పడిపోయింంది. దీంతో స్థానికంగా కూరగాయలు అందుబాటులో లేకపోవడం తో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నారు. ఫలితంగా ధరల పెంపు తప్పటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. నిత్యం వినియోగించే కూరల ధరలు భారీగా పెరిగాయి. కిలో టమాటా రూ.70 వరకు చేరుకుంది. కాకరకాయ, పచ్చిమిర్చి, క్యారెట్, బీరకాయ, కాకరకాయ, చిక్కుడు ధరలు కూడా పెరిగాయి. గతంలో కిలో కాకరకాయ రూ.30 నుంచి రూ.40 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా కేజీ రూ.60కి చేరుకుంది. ఇక గతంలో కిలో టమాట రూ.25గా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.100 వరకు పలుకుతోంది. అలాగే బీర, క్యారెట్, చిక్కుడు ధరలు కూడా పెరిగాయి. అలాగే సొరకాయ, మెంతికూర ధరలు కూడా పెరిగాయి.

 క్రెడిట్ కార్డు వినియోగదారులకు RBI గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు RBI గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
vegetable-prices-surge-due-to-monsoon-related-crop-damage-and-supply-disruptions

మరో నెల రోజుల వరకు ధరలు తగ్గే అవకాశం లేనట్లే

ఏపీ, తెలంగాణలో నూ ఈ ధరల పెరుగుదల కొనసాగుతోంది. కిలో బెండ రూ.35, క్యారెట్ రూ.42, బీన్స్ రూ.75, గొరుచిక్కుడు రూ.28, చిక్కుడు రూ.45, బీర రూ.35, చామగడ్డ రూ.27, కీర రూ.40, క్యాప్చికం రూ.67, బీట్ రూట్ రూ.25, కందగడ్డ రూ.33, చిలకడదుంప రూ.21, వంగ రూ.18, బెండ రూ.35, దొండ రూ.18, ఉల్లిపాయ రూ.24, ఆలుగడ్డ రూ.17, క్యాబేజీ రూ.23 పలుకుతోంది. అదే విధంగా రైతు బజార్లలో కిలో వంగ రూ.42, బెండ రూ.20, పచ్చిమిర్చి రూ.40, కాకర రూ.44, క్యాబేజీ రూ.32, క్యారెట్ రూ.42, దొండ రూ.22, బంగాళదుంప రూ.24, ఉల్లిపాయ రూ.25, గోరుచిక్కుడు రూ.30, దోశ రూ.20, సొర రూ.13, చిక్కుళ్లు రూ.70, చామదుంప రూ.28, కంద రూ.40, చికలడదుంప రూ.28 పలుకుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+