భారత్ పాక్ లు శాంతించాలిః పావెల్
వాషింగ్టన్‌ః భారత్ - పాకిస్తాన్ లు శాంతంగా వ్యవహరించాలని అమెరికా విదేశాంగశాఖ మంత్రి అలెన్ పావెల్ మరోసారివిజ్ఞప్తి చేశారు. భారత్ పాక్ లకు సంయమనంతో వ్యవహరించాల్సిందిగా ఎప్పుడూ చెబుతూ వుంటాం. ఈ సారి మరింత గట్టిగా చెబుతున్నాం అని పావెల్ మంగళవారంవిలేకరులతో మాట్లాడుతూ కోరారు. కాశ్మీర్ పరిస్థితిపై అమెరికా కూడా ఆందోళన చెందుతున్నది.అయినప్పటికీ భారత్ - పాక్ లు గతంలో కంటే ఎక్కువగా సహనం పాటించాలని ఆయన హితవు చెప్పారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు రెండు దేశాలూ తమ శక్తి యుక్తులను ధారపోయాలని, పరస్పర దూషణలు మానుకోవాలనికోరారు. పరస్పర దూషణలకు ఇద తగినసమయం కాదని పావెల్ అన్నారు.












Click it and Unblock the Notifications