ముషారఫ్‌పై విరుచుకపడిన వాజ్‌పేయి

సోమనాథ్‌ (గుజరాత్‌): పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ ఇటీవలి ప్రకటనలపై భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పెద్ద యెత్తున విరుచుకుపడ్డారు. భారత ఏకత, సమర్థతలవిషయాల్లో భ్రమలు ఎవరికి కూడా అవసరం లేదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ భారతదేశంలోని అంతర్భాగమని, మరోసారి దేశ విభజనను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. సోమనాథ్‌ దేవాలయం 50 ఏళ్ల పునర్నిర్మాణ ఉత్సవ సభలో ఆయన మాట్లాడారు.

మన సోదరీమణులు గాజులు తొడుక్కుని వుండడం చూసి కొంత మంది భ్రమపడుతున్నట్టున్నారు అని- తమ సమర్థత గురించి బారత్‌కు తెలియజెప్పేవిషయంలో తాము గాజులు తొడుక్కుని లేమనిపర్వేజ్‌ ముషారఫ్‌ చేసిన ప్రకటనను దృష్టిలోపెట్టుకుని వాజ్‌పేయి అన్నారు. మేం ఈ భాష మాట్లాడం. కానీ, పంజాబ్‌లో గాజులకువిశేష ప్రజాదరణ వుంది. పైగా ఇక్కడ ఇతర గాజులతో పాటు కాడా(ఉక్కు గాజు)లను ధరిస్తారు. మాటలు గాజుల స్థాయికి దిగజారితే అది మానవ నైజం కాదు అని ఆయన అన్నారు.

ఏ సవాల్‌నైనా ఎదుర్కోవడానికి తగిన బలం, ఐక్యత, సంపద భారత్‌కు ఉన్నదని, ఈవిషయంలో ఎవరికీ భ్రమలు వుండాల్సిన పని లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+