ఎడతెగని ఆర్టీసీచర్చలు
హైదరాబాద్‌ః ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతున్నది. మంగళవారం అర్థరాత్రి వరకు కార్మిక సంఘాలు - మంత్రివర్గ ఉపసంఘం మధ్య సచివాలయంలో చర్చలు జరుగాయి. అయితే ఎటువంటి పరిష్కారం లభించకుండానే చర్చలు ముగిసాయి. సమ్మె 17వ రోజుకు చేరుకోవడంతో ఇరుపక్షాలు కాస్త రాజీ ధోరణిని ప్రదర్శించినా చర్చలు సఫలం కాలేదు. బుధవారం సాయంత్రం నుంచి తిరిగి చర్చలు ప్రారంభించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి.
వేతనాలపెంపుదలను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతుండగాఅక్టోబర్ ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం భీష్మిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో వాహనాల పన్నును 7 నుంచి 9 శాతానికి తగ్గించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పదిశాతానికి మాత్రమే తగ్గించగలమని ఆర్టీసీ యాజమాన్యంఅంటున్నది. ఆర్టీసీని ప్రైవేటీకరించబోమంటూ స్పష్టమైన హామీ ఇవ్వాలనే కార్మిక సంఘాల డిమాండ్ కు ప్రభుత్వం మౌనం వహిస్తున్నది.
16 రోజుల ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతపెరిగిపోతుండడం, ప్రతిపక్షాలు రెచ్చిపోతున్న తరుణంలో సమ్మెపై ప్రభుత్వం గతంలో వున్నంత పట్టుదలగా లేదు. ఫలితంగా బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యే చర్చలు ఫలిస్తాయని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయి.












Click it and Unblock the Notifications