అంటరానితనంపై యుద్ధభేరి
హైదరాబాద్‌ః అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. అంటరానితనం నిర్మూలనకు మూడు రోజుల పాటు జనచైతన్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పుష్పలీల బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్రావతరణ దినోత్సవమైన గురువారం నాడు అంటరానితనం నిర్మూలనకు సంబంధించిన ఓ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెదక్ జిల్లా పులకల్ గ్రామంలో ప్రారంభిస్తారు.
జస్టిస్ పున్నయ్య సిఫారసులకు అనుగుణంగా వారం రోజుల్లో ఎస్.సి., ఎస్.టి., కమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు పుష్పలీల చెప్పారు. అంటరానితనం కేసులు అధికంగా వున్న జిల్లాలలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేఅంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆమె వివరించారు.












Click it and Unblock the Notifications