వారణాసిలోని అమెరికన్లకు ముప్పు!
వారణాసిః వారణాసిలోవున్న అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తామంటూ అల్-ఖైదాపేరిట టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఓ బెదిరింపు లేఖఅందింది. ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడుల నేపధ్యంలో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ లేఖను తీవ్రంగా పరిగణించింది. ఈ లేఖఅందిన తరువాత వారణాసిలోని అమెరికా పౌరులకు మరింత భద్రత కల్పించారు. అమెరికన్ల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారణాసి పోలీసులువివరించారు. తాజా పరిణామాలను పోలీసులు వారణాసిలోని అమెరికా పౌరులకువివరించి అప్రమత్తంగా వుండాల్సిందిగా కోరారు.
కొత్త ఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయానికి నేరుగా గానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ సమాచారం పంపాల్సిందిగా పోలీసులుకోరారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు అందిన లేఖ ఎంత వరకు నిజం? ఆ లేఖ నిజంగానే అల్ ఖైదా నుంచి వచ్చిందా లేక స్థానికులే ఇలా బెదిరింపు లేఖలుపంపారా? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications