గుంటూరుః రాష్ట్ర మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీసీనియర్ నాయకుడు డాక్టర్ ఎం.ఎస్.ఎస్. కోటేశ్వరరావు బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన ఎం.ఎస్.ఎస్. కోటేశ్వరరావు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. బుధవారం ఆయనకు ఛాతీలో ఇబ్బందిగా వుండడంతో జయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస డిచారు.
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఎమ్మెస్సెస్ కీలకపాత్ర పోషించారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్ అధ్యక్ష పదకి గట్టి పోటీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రి పద చేపట్టిన తరువాత జిల్లా రాజకీయాలకే ఆయన పరిుతం కావలసి వచ్చింది. ఎమ్మెస్సెస్ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications
