బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు.. గణనాధుడు కూడా ఇష్టపడేలా మెచ్చుకునేలా ఇలా చెయ్యండి!

వినాయక చవితి వచ్చేస్తోంది. గణనాధుడికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేయటానికి అందరూ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వినాయక చవితి స్పెషల్ స్వీట్స్ మనం తెలుసుకుంటున్నాం. ఈరోజువినాయకుడికి బాగా ఇష్టం అయిన బెల్లం కుడుములు, ఉండ్రాళ్ళు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం. ఆంధ్రా-తెలంగాణ సాంప్రదాయ మిఠాయి అయిన ఈ బెల్లం కుడుములు, ఉండ్రాళ్ళు పండుగల్లో, ప్రత్యేక సందర్భాల్లో చేసుకునే రుచికరమైన స్వీట్.

కావాల్సిన పదార్థాలు (4-5 మందికి):

బియ్యపు పిండి - 2 కప్పులు
బెల్లం - 1¼ కప్పు (ముక్కలుగా చేసినది)
నీళ్లు - 2 కప్పులు (పిండి కోసం) + కొంచెం అదనంగా
ఏలకుల పొడి - ½ టీస్పూన్
పెసరపప్పు - కొద్దిగా నానబెట్టినది
కొబ్బరి తురుము - కొద్దిగా తురుముకున్నది
నెయ్యి - కలపడానికి
ఉప్పు - చిటికెడు

Bellam Kudumulu undrallu Recipe How to Make tasty Jaggery Kudumulu undraallu for ganesh chaturthi

తయారీ విధానం:

ముందుగా బెల్లాన్ని సన్నగా తురుముకోండి, లేదా మెత్తగా పొడిగా దంచుకోండి. ఆపై స్టవ్ వెలిగించి ఒక పాత్రలో 2 కప్పుల నీరు పోసి మరిగించండి. అందులో చిటికెడు ఉప్పు వేసి , కొద్దిగా నెయ్యి వేసి, ఆపైల కొద్దిగా బియ్యం పిండిని వేసి ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో బియ్యం పిండి, బెల్లం, నానబెట్టిన పెసరపప్పు, కొబ్బరి తురుము, దంచుకుని పొడి చేసుకున్న యాలుకల పొడి వేసి కలపండి.

వినాయకచవితి స్పెషల్ పాలతాలికలు.. ఇలా చేస్తే గణేశుడు కూడా వదిలిపెట్టడు!
వినాయకచవితి స్పెషల్ పాలతాలికలు.. ఇలా చేస్తే గణేశుడు కూడా వదిలిపెట్టడు!

ఇలా చేస్తే కుడుములు, ఉండ్రాళ్ళు సూపర్ టేస్ట్

అందులో ఉడికించుకున్న బియ్యం పిండి ద్రావకాన్ని వేసి కలుపుతూ ఉండగా చేసుకోండి. ఆపైనెయ్యి రాసుకుంటూ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని కుడుములుగా ఒత్తుకోండి. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి ఆపై కుడుములను పాత్రలో పెట్టి ఉడికించండి. లోపల పిండి పిండిగా లేదంటే కుడుములు బాగా ఉడికినట్టే. ఈ పిండితో కుడుములు మాత్రమే కాదు ఉండ్రాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళ మాదిరిగా చేసుకుని వాటిని ఇడ్లీ పాత్రలో ప్లేట్ లకు నెయ్యి రాసి, పాత్ర అడుగున నీళ్ళు పోసి ఇడ్లీ మాదిరిగా ఉడకబెట్టుకోవటమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+