న్యూఢిల్లీ: భారత మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ కావాలని బంతిని టాంపర్ చేశాడని తాను అనుకోవడం లేదనివివాదాస్పద బ్రిటిష్ మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ అన్నారు. టాంపరింగ్ అనేది అనుకోకుండా వచ్చే పదం. ప్రతి ఒక్కరూ దాన్నేవాడాలనుకుంటారు అని ఆయన అన్నారు.
బంతి ఆకారాన్ని మార్చాడనే ఆరోపణపై సచిన్‌కు శిక్ష పడింది. టెండూల్కర్ బంతి ఆకారాన్ని మార్చాడని తాను అనడం లేదని ఇప్పుడు డెన్నిస్‌అంటున్నారు. తాను బాల్ టాంపరింగ్ అనలేదని, తన నిర్ణయాన్ని తప్పుగాఅర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.
అంపైర్ పర్యవేక్షణలో సచిన్ బంతి శుభ్రం చేయాల్సి వుండిందని, అయితే అలా చేయలేదని, ఇది సాంకేతికపరమైన నిర్లక్ష్యమే తప్ప కావాలని చేసింది కాదని మైక్ డెన్నిస్ అన్నారు. నేను దాన్ని బాల్ టాంపరింగ్ అనను. బంతిపై యాక్షన్ అని అనిఅంటాను లేదా ఏదైనా కానీ టాంపరింగ్‌కు సంబంధించి నిబంధనల్లో ఏమీ లేదు. ఆంగ్ల భాషను ఎలా అన్వయిస్తామనే దానిపై ఆధారపడి వుంటుంది అని ఆయనవివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
