విశాఖలో సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ - వాణిజ్యం నుంచి క్వాంటం వరకు, ఎన్నో ప్రత్యేకతలు..!!
విశాఖ కేంద్రంగా నిర్వహించే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు అధికారులకు కీలక దిశా నిర్దేశం చేసారు. నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ జరగనుంది. 'నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్ , టెక్నాలజీ, ట్రస్ట్' థీమ్‌తో 31వ సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందులో 59 దేశాల ప్రాతినిధ్యం.... 15 మంది విదేశీ మంత్రుల భాగస్వామ్యం కల్పించారు. వాణిజ్యం నుంచి క్వాంటం వరకు.. ఆరు ప్రధాన రంగాలపై చర్చలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాఖలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌లో చర్చించే అంశాలు, డిక్లరేషన్లపై సిఐఐ ప్రతినిధులు, అధికారులతో సీఎం రివ్యూ చేసారు. విశాఖ సమ్మిట్ రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల ను విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలను అనుసంధానిస్తూ... చర్చలను వ్యాపార, సాంకేతిక భాగస్వా మ్యాల దిశగా తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రపంచ మార్కెట్లతో రాష్ట్ర పరిశ్రమలను అనుసంధా నించడం, ఎంఎస్‌ఎంఈలకు కొత్త వ్యాపార పరిచయాలు కల్పించడం ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, యువత నైపుణ్యాలకు అంతర్జాతీయ అవకాశాలను పరిచయం చేయడం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం పెంచేలా సదస్సు జరగాలని పేర్కొన్నారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక రాయితీల చెల్లింపు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలు ప్రపంచ వ్యాప్తం కావాలని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు కీలక దిశా నిర్దేశం
అదే విధంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, సెమికండక్టర్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. అత్యుత్తమ పాలసీలు, సమర్థులైన నిపుణులు, మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్, బలమైన నాయకత్వం వంటి అనుకూలతలు ఉన్న రాష్ట్రం ఏపీగా వివరించారు. రాష్ట్రంలో ఏపీలో పెట్టుబడి సురక్షితం, సులభతరం అనే విషయం పారిశ్రామిక వేత్తలకు తెలియాలని స్పష్టం చేసారు. ప్రపంచ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురానున్న విశాఖ సదస్సు ద్వారా ఏపీకి ఉన్న అవకాశాలను ప్రపంచం గుర్తించేలా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెండు రోజుల సదస్సుకు వివిధ దేశాల రాయబారులు, ప్రపంచ ఆహార కార్యక్రమం, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.













Click it and Unblock the Notifications
