చైనా సరిహద్దుల్లో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఐఏఎఫ్ ఫ్లైట్ ల్యాండింగ్
భారత వైమానిక దళం చరిత్ర తిరగరాసింది. ఐఎల్-76ఎండీ భారీ రవాణా విమానం లడఖ్‌లోని న్యోమా అడ్వాన్స్డ్ ఎయిర్ బేస్ లో విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఎయిర్ బేస్ ఇది. ఏ ప్రదేశంలోనైనా ఈ రకానికి చెందిన రవాణా విమానం ఈ స్థాయి ఎత్తు ఉన్న ఎయిర్ బేస్ స్టేషన్ లో సురక్షితంగా ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత సైనిక బలగాల వ్యూహాత్మక సన్నద్ధత, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఇది.. కీలకంగా మారబోతోంది.
చైనాతో వాస్తవాధీన రేఖకు 25 కిలోమీటర్ల సమీపంలో సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుందీ న్యోమా ఎయిర్ బేస్. ఇక్కడ వాతావరణ పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. క్షణక్షణానికి వాతావరణం మారుతుంటుంది. అలాంటి చోట 100 టన్నులకు పైగా బరువు ఉండే ఈ భారీ విమానం సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై వైమానిక దళం ప్రత్యేక హర్షం వ్యక్తం చేసింది.

సిబ్బంది నైపుణ్యం, ఖచ్చితత్వం, సమయస్ఫూర్తి వల్లనే ఈ క్లిష్టమైన ప్రక్రియ సాధ్యమైందని వైమానిక దళాధికారులు ప్రశంసించారు. క్లిష్టమైన పర్వత ప్రాంతాలలో సైతం పెద్ద ఎత్తున బలగాలు, యుద్ద సామాగ్రి, ఆయుధాలను సకాలంలో, నేరుగా చేరవేసే సామర్థ్యాన్ని వైమానిక దళం అందిపుచ్చుకొందనిపేర్కొంది. ఎటువంటి కఠిన వాతావరణంలోనైనా యుద్ధ విమానాలు, కార్గో ఎయిర్ క్రాఫ్ట్ లను ల్యాండ్ చేయగలమనే విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించింది.
న్యోమా ఎయిర్ బేస్ ను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధునికీకరించింది. చైనాకు అతి సమీపంలో ఉండటం వల్ల వ్యూహాత్మకంగా దీన్ని పునర్నిర్మించాల్సి వచ్చింది. భారీ సరుకు రవాణా విమానాలను ల్యాండ్ అయ్యేలా దీన్ని తీర్చిదిద్దింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పూర్తిస్థాయి ఎయిర్‌బేస్‌గా మార్చింది. కాంక్రీట్ రన్‌వే నిర్మాణం పూర్తి కావడం వల్ల అన్ని రకాల శీతోష్ణస్థితి పరిస్థితుల్లోనూ భారీ సైనిక విమానాలు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించే వెసులుబాటు కలిగింది.
13,629 FEET. A NEW HEIGHT IN AVIATION HISTORY.An Indian Air Force IL-76MD has scripted history with a successful landing at Nyoma, marking the highest-altitude landing ever achieved by the aircraft anywhere in the world.A remarkable demonstration of the aircraft’s enduring capability, backed by the exceptional skill, precision, and professionalism of its crew.A milestone that reinforces India’s strategic airlift capability.Pushing boundaries. Redefining limits. Making history.#IndianAirForce #IAF #Nyoma #AviationHistory #IndianDefence @DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@indiannavy@CareerinIAF@air_veterans
— Indian Air Force (@IAF_MCC) November 7, 2026
తూర్పు లడఖ్ సరిహద్దులో 2020 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో న్యోమా ఎయిర్ బేస్ భారత్‌కు వ్యూహాత్మక కేంద్రంగా మారింది. మంచు కురిసే శీతాకాలంలో కొండ మార్గాల ద్వారా సరుకుల రవాణా స్తంభించిపోయే అవకాశం ఉన్నందున వైమానిక మార్గమే ఏకైక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఐఎల్-76ఎండీ వంటి భారీ విమానాలు ఇక్కడ ల్యాండ్ కావడం ద్వారా ట్యాంకులు, ఆర్మర్డ్ వాహనాలు, భారీ యంత్రాలను తక్కువ సమయంలో సరిహద్దు ప్రాంతాలకు చేరవేయడం తేలికవుతుంది.












Click it and Unblock the Notifications
