తెలంగాణా ప్రభుత్వ ఆదాయ అన్వేషణ.. వాటిపై ఫోకస్, మంత్రి కీలక ఆదేశాలు!

ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్, పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఆస్తుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి భట్టి అధ్యక్షత వహించారు.

ఉపసంఘ సభ్యులు మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు సమకూరిన ఆదాయం, ప్రతిపాదనల వివరాలను అధికారులు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను సమయానికి సాధించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని భట్టి సూచించారు.

Achieve Revenue Targets on Time Dy CM Bhatti Directs Officials on Land Pooling and Industrial Regularisation

సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కోరారు.అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. బీ-కేటగిరీ, పారిశ్రామిక యూనిట్ల ప్రతిపాదనలపై పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరేలా, అదే సమయంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలన్నారు.

దరఖాస్తుల పరిష్కారానికి వారాలవారీగా లక్ష్యాలు నిర్ణయించి, సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్, భవిష్యత్ అవసరాలకు భూముల లభ్యతపై చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన భూములను ముందుగానే గుర్తించాలని భట్టి అన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై పారదర్శకమైన విధానం రూపొందించాలని సూచించారు.

హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ పరిధిలోని భూముల అభివృద్ధి, వేలం ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను కూడా సమీక్షించారు. భూముల వివరాలు, లేఅవుట్ల ప్రస్తుత స్థితి, వేలానికి సిద్ధంగా ఉన్న ప్లాట్లు, ముందస్తు ఏర్పాట్ల పురోగతి తదితర అంశాలతో కూడిన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను వచ్చే వారంలోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. వివరాలతో ప్రత్యేక డిజిటల్ డ్యాష్‌బోర్డ్ రూపొందించాలని కూడా సూచించారు.

గ్రామ పంచాయతీలకు సొంత ఖాతాలు.. స్వయం ఆర్ధిక ప్రతిపత్తితో ఆ విధానానికి స్వస్తి
గ్రామ పంచాయతీలకు సొంత ఖాతాలు.. స్వయం ఆర్ధిక ప్రతిపత్తితో ఆ విధానానికి స్వస్తి

ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని, దీనికోసం శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆదాయ లక్ష్యాల సాధనకు సమయం కీలకమని, జాప్యం లేకుండా పనులు చేపట్టాలని అన్నారు.ఈ చర్యలతో రాష్ట్ర ఆర్థిక వనరులు బలపడి, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు సులభంగా అందుబాటులోకి వస్తాయని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+