హైదరాబాద్‌ః రాష్ట్రంలో తీవ్రరూపం ధరిస్తున్న నిరుద్యోగ సమస్యను సత్వరం పరిష్కరించాల్సిందిగా కోరుతూ సి.ఎల్.పి. అధినేత వై.ఎస్. రాజశేఖర రెడ్డికోరారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ మేరకు ఓ లేఖరాశారు. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 35 లక్షల మంది నిరుద్యోగులున్నారని, మొత్తంమీద కనీసం కోటిమంది నిరుద్యోగ యువత నానా అవస్థలు పడుతున్నదని వై.ఎస్. తన లేఖలోపేర్కొన్నారు. ఇబ్బడి ముబ్బడిగా మండలానికో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆయన అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో ఎన్ని ఉద్యాగాలిచ్చారో వెల్లడించాలని సవాలువిసిరారు.
ఈ ఆరేళ్ళ కాలంలో 50 మందికి ఉపాథి కల్పించే ఒక్క పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయలేదని వై.ఎస్.విమర్శించారు. వేలాది మందిని నిరుద్యోగులుగా మార్చుతున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. కల్లబొల్లి కబుర్లు మాని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వ కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications