ఇస్లామాబాద్‌ః నార్తరన్‌ అలయెన్స్‌ కు చెందిన ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కమాండర్లతో పాటు మొత్తం 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌ లోని టఖార్‌ ప్రావిన్స్‌ లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనకు గల కారణాలు తెలియడం లేదని, శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో నార్తరన్‌ అలయెన్స్‌ ప్రముఖ కమాండర్లు ముగ్గురు చనిపోయారని పాకిస్తాన్‌ కు చెందిన ఆఫ్ఘన్‌ ఇస్లామిక్‌ ప్రెస్‌ తెలిపింది.

గతంలో అలయెన్స్‌ అధినేతగా వున్న అహ్మద్‌ షా మసూద్‌ సన్నిహితుడైన కమాండర్‌ మహమ్మద్‌ ముస్తఫా తోపాటు మరో ఇద్దరు ప్రముఖ కమాండర్లు ఈ దుర్ఘటనలో మరణించారు. ఈ ప్రమాద వార్తను నార్తరన్‌ అలయెన్స్‌ అధికారిక వర్గాలు ఇంకా ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+