నేను మాట్లాడినా సమస్యే.. మౌనంగా ఉన్నా సమస్యే - రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ భారతదేశపు అగ్రశ్రేణి నటుల్లో ఒకరు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఆయనకు భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రజినీకి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో. రీసెంట్ గానే లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' మూవీలో నటిస్తున్నారు. 2023లో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జైలర్' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. రజనీకాంత్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించింది. దీంతో సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రజనీ 173వ ప్రాజెక్ట్ చుట్టూ నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది.

రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్.. ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ సరసన సిమ్రాన్ నటిస్తుండగా, రాశి ఖన్నా, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాకి "ధర్మన్: ది డెడ్లీ డాక్టర్ " అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చెన్నైలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో మూవీని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో సినిమా విశేషాల కంటే.. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారాయి.
ఎలా ఉన్నా ట్రోలింగే..
ఇటీవలి కాలంలో తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్‌పై రజనీకాంత్ ఈ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బహిరంగంగా మాట్లాడాలంటేనే భయమేస్తోందని.. ఎందుకంటే తాను మాట్లాడితే అది సమస్యగా మారుతుందని ఓపెన్ అయ్యారు. ఒకవేళ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. 'ఎందుకు మౌనంగా ఉన్నాడు?' అంటూ కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే అవుతోంది అని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. మనల్ని ఇష్టపడని వాళ్లకు మనం ఏం చేసినా నచ్చదని.. అలాగే మనల్ని ఇష్టపడేవాళ్లు మనం ఏం చేసినా మెచ్చుకుంటారు అనుకోవడం కూడా మూర్ఖత్వమే అంటూ వ్యాఖ్యానించారు.
தர்மமே வெல்லும்!#Dharman #Thalaivar173 #SuperstarRajinikanth #KamalHaasan @rajinikanth @ikamalhaasan #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @iYogiBabu @SimranbaggaOffc #RaashiKhanna @nikethbommi #KarthikRajkumar @PradeepERagav @kabilanchelliah @ShruthiManjari… pic.twitter.com/UWjXErKdIE
— Raaj Kamal Films International (@RKFI) June 24, 2026
ఇక ఈ సినిమా సినిమా డైరెక్టర్లు మారిన విషయంపై సైతం క్లారిటీ ఇచ్చారు. మొదట కె.ఎస్. రవికుమార్, ఆ తర్వాత సుందర్ సి, ఆపై సిబి చక్రవర్తి పేర్లు పరిశీలనలోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా సిబి చక్రవర్తి అనుకున్న న్యూక్లియర్ సైంటిస్ట్ కథ చాలా బాగున్నప్పటికీ.. భారీ సెన్సిటివ్ సబ్జెక్ట్ కావడం వల్ల సమయం పడుతుందని దాన్ని వాయిదా వేసినట్టు చెప్పుకొచ్చారు. చివరకు ఈ ప్రాజెక్ట్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు చేతుల్లోకి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications