గాజా సిటీః పాలస్తీనాపై ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేసింది. ఆదివారం జరిగిన తాజా దాడుల్లో రెండు పాలస్తీనా పోలీస్ పోస్టులు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దళాలు వెస్ట్ బ్యాంక్ కు చెందిన రెండు ప్రాంతాలనుస్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందింది. వెస్ట్ బ్యాంక్ లోని అనాబ్టా, రామిమ్ పట్టణాల్లోకి పాలస్తీనాసేనలు ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
యుద్ధ టాంకులు,సైనికులు ఈ పట్టణాల్లో ప్రవేశించి, పాలస్తీనీయులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారని ఆ సాక్షులువివరించారు. శనివారం నాడు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో రెండు పాలస్తీనా పోలీస్ పోస్ట్ లు ధ్వంసం అయ్యాయి.
తాజాదాడుల్లో మరో ఇద్దరు పాలస్తీనా పౌరులు మరణించారు. దీనితో గతసెప్టెంబర్ నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 1,057కుపెరిగింది.












Click it and Unblock the Notifications