సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం
న్యూఢిల్లీః భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కాల్పుల హోరు కొనసాగుతున్నది. పూర్తి స్థాయి యుద్ధం ఏ క్షణంలోనైనా బద్దలయ్యే అవకాశం వున్నదన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొని వున్న పరిస్థితి పై అమెరికా కూడా ఆందోళన చెందుతున్నది. ఉభయదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొని వున్నదని రెండు దేశాలు పోటీపడి అణ్వాస్త్రాలను కూడా మొహరిస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలనుంచి నివేదికలు అందడంతో ఈ రెండు దేశాల సరిహద్దులపై గట్టి నిఘాకు అమెరికా ఆదేశించింది.












Click it and Unblock the Notifications