నామినేషన్ల ఘట్టం ప్రారంభం
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం బుధవారం మొదలైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్, మణిపూర్ శాసనసభల ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ అయింది.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్ట ప్రకారం, నిర్ణీత విధానాల ప్రకారం జరగనందున తమిళనాడులోని సైదాపేట్, వనియంబాది శాసనసభా నియోజకవర్గాల ఉప ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది.
ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 14, 18, 21 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. పంజాబ్, ఉత్తరాంచల్ అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 13, 14 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మణిపూర్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 14, 21 తేదీల్లో జరుగనుంది.
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జనవరి 23. తర్వాతి రోజు స్క్రూటినీ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి 28.
ఉప ఎన్నికలు జరిగే ఏడు శాసనసభా స్థానాలు- యమునానగర్ (హర్యానా), అర్వి (మహారాష్ట్ర), అజ్మీర్ వెస్ట్ (రాజస్థాన్), అండిపట్టి (తమిళనాడు), సయాజిగంజ్, మహువా, రాజ్‌కోట్-11 (గుజరాత్)
పంజాబ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడుతారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి సారి ఆరు శాసనసభా నియోజక వర్గాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications
