ఎన్నికల పరుగులోసైకిల్ ముందంజ
హైదరాబాద్:మినీ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం తన ఆధిక్యతను నిరూపించుకుంది. మార్కాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. గురువారం రాత్రి తొమ్మిది గంటలకుఅందిన ఓట్ల లెక్కింపు ప్రకారం- రాజమండ్రి నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం మేయర్ అభ్యర్థి చక్రవర్తి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అయితే, కార్పోరేషన్ డివిజన్లలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యతను కొనసాగిస్తోంది.
హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం మేయర్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి మొదటి రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఆధిక్యతను సాధించారు. హైదరాబాద్ మేయర్ పదవికి 57 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో బ్యాలెట్ పత్రం చాలా పొడవుగా తయారైంది. దీంతో ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. హైదరాబాద్ మేయర్ ఫలితం శుక్రవారం నాటికి గాని వెలువడే అవకాశం లేదు.
హిందూపూర్ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక్కడ మిత్రపక్షం బిజెపి అభ్యర్థి పోటీలో వుండడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వార్డుల్లో మాత్రం ఎక్కువ స్థానాలను తెలుగుదేశం దక్కించుకుంది.












Click it and Unblock the Notifications
