బాబు సంతృప్తి:విపక్షాల పెదవి విరుపు

హైదరాబాద్‌: రాష్ట్రబడ్జెట్‌ ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా వుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చామని ఆయన గురువారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుబడ్జెట్‌ను ప్రతిపాదించిన అనంతరం విలేకరులతో అన్నారు. ప్రభుత్వం ముందుగా విడుదల చేసిన వ్యూహ పత్రాలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.

నీటిపారుదలకు ఇతోధిక నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం దివాళాకోరు బడ్జెట్‌ను ప్రతిపాదించిందని ప్రతిపక్ష నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివిమర్శించారు. అది రాష్ట్రాన్ని దివాళా తీయించేబడ్జెట్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్‌ ఛార్జీలపెంపును బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది చీటింగ్‌బడ్జెట్‌ అని సిపిఎం పక్ష నాయకుడు నోముల నర్సింహయ్యవిమర్శించారు. నీటి పారుదల రంగానికి నిరుటితో పోలిస్తే 1300 కోట్ల రూపాయల కేటాయింపులు తగ్గించినట్లు ఆయన చెప్పారు. పాత బస్తీ అభివృద్ధి ప్రస్తావనబడ్జెట్‌లో లేకపోవడాన్ని మజ్లీస్‌ పక్ష నాయకుడుఅసదుద్దీన్‌ ఓవైసీ తప్పు పట్టారు. ఉర్దూ భాషాభివృద్ధి ప్రస్తావన కూడాబడ్జెట్‌లో లేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం మిత్రపక్షం బిజెపి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినబడ్జెట్‌పై విమర్శలు చేసింది. రెవెన్యూ లోటు గురించి ప్రభుత్వానికి పట్టడం లేదని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు ఎన్‌. ఇంద్రసేనా రెడ్డివిమర్శించారు. నీటి పారుదల రంగం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆయనవిమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+