హైదరాబాద్‌ః నక్సలైట్లతో చర్చలకు సంబంధించిన అంశాన్ని చర్చించేందుకు ఈ నెల 21 ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
నక్సల్స్‌తో చర్చలవిషయంలో ప్రభుత్వం చిత్తశుద్దిని శంకించడంలోఅర్ధం లేదని హోం మంత్రి దేవేందర్‌గౌడ్ అన్నారు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినంత మాత్రానా అది ప్రభుత్వం చర్చలవిషయంలో తీసుకున్న నిర్ణయానికి అడ్డుగోడగా భావించడం సమంజసం కాదని హోం మంత్రి చెప్పారు. పోలీసులు వారి పని వారు చేసుకుపోతున్నారని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తదనుగుణంగా వారు ప్రవర్తిస్తారని ఆయన చెప్పారు.