జగిత్యాలలో సబ్‌స్టేషన్ ముట్టడి
కరీంనగర్:విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ గురువారం నాడు కరీంనగర్ జిల్లా జగిత్యాలలో భారీ ఆందోళనను చేపట్టింది. పార్టీ కార్యకర్తలు, రైతులువిద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. ఎంతకీ శాంతించకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనకారులు దాదాపు మూడు గంటల పాటు కరీంనగర్, నిజామాబాద్ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, రత్నాకర్ రావు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications