దేశం విధానాలు మారలేదు: బాబు
హైదరాబాద్: గతఇరవై యేళ్లలో తమ పార్టీ విధానాలు మారలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో పార్టీ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావువిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తోందని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ అన్నారు. పార్టీని గ్రామ స్థాయి వరకు తీసికెళ్లగలిగామని ఆయన చెప్పారు. యువతరం అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీలో మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
