మిలిటెంట్ల చేతిలో పది మంది బలి
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం వరకు జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లోమిలిటెంట్ల ఘాతుకాలకు పది మంది బలయ్యారు. ఒక గ్రామంలోమిలిటెంట్లు విచక్షణారహితంగా చేసిన దాడిలో ఏడుగురు మరణించారు. మరో సంఘటనలోస్వీట్ షాపును పేల్చడంతో ముగ్గురు మరణించారు.
దుకాణం శిథిలాల కింద బాధితులు కూరుకుపోయారు. పేలుడులో దుకాణం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది.
భారీ సాయుధ మిలిటెంట్లు ఆదివారం రాత్రి ఉద్ధంపూర్ జిల్లాలోని కొన్ని ఇళ్లపై గ్రెనేడ్లు విసరడంతో ఏడుగురు మరణించారు. ఇందులో ఇద్దరు మహిళలు, వారి కూతుళ్లు వున్నారు. గ్రామ రక్షణ కమిటీ సభ్యులకు,మిలిటెంట్లకు మధ్య అంతకు ముందు హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి.
మిలిటెంట్లు ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దండ్లి గ్రామంపై దాడి చేశారు. ఈ సందర్భంగా గ్రామ రక్షణ కమిటీ సభ్యులకు,మిలిటెంట్లకు మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఏడుగురు మరణించడంతో పాటు ముగ్గురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
