పాక్ కాల్పుల్లో ఆర్మీ అధికారుల మృతి
శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో శనివారం ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు సైనికాధికారులు మరణించారు. ఇద్దరు పౌరులు గాయపడ్డారు.
మచిల్ సెక్టార్‌లోని అశ్వని పోస్టు వద్ద పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో శుక్రవారం జెసిఒ సచాసింగ్, లాన్స్‌నాయక్ రంజీత్ సింగ్, సిపాయి సంతోష్ కుమార్ మృతి చెందినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం నుంచి పాకిస్థాన్ బలగాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో పాఠశాల, మసీదు భవనాలతో పాటు దాదాపు 12 ఇళ్లు ధ్వంసమయ్యాయి.












Click it and Unblock the Notifications