దేవీశ్రీ ఫస్ట్ లుక్: రాక్‌స్టార్ నుంచి అమాయక గ్రామీణ యువకుడిగా
నేడు.. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న మొదటి చిత్రం ఎల్లమ్మ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇప్పటిదాకా మ్యూజిక్ కంపోజర్ గా, ప్లేబ్యాక్ సింగర్ గా యూత్ ను ఉర్రూతలూగిస్తూ వచ్చిన దేవీశ్రీ ప్రసాద్.. ఈ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేయబోతోన్నాడు. ఈ క్రేజీ మూవీలో పార్శి అనే ఓ విలక్షణ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రంలో పూర్తి భిన్నమైన డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించాడు. ఓ సాదాసీదా పల్లెటూరి యువకుడిగా ఆయన మేకోవర్ అద్భుతంగా కుదిరింది. కళ్లలో అమాయకత్వం, ముఖంలో సహజత్వం ఉట్టిపడుతుండటంతో ఈ పాత్రతో దేవిశ్రీ ప్రసాద్ చేసిన లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అభిమానులను ఆకట్టుకుంటోంది. మొదటిసారిగా నటుడిగా అడుగుపెడుతున్నప్పటికీ.. డీఎస్పీ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనే విషయం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

ఎంతో అనుభవం ఉన్న నటుడి తరహాలోనే ఆయన హావభావాలు పలికాయి. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న దేవిశ్రీ ప్రసాద్.. ఈ నేచురల్ రూరల్ బ్యాక్ గ్రౌండ్ క్యారెక్టర్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తాడని యూనిట్ నమ్ముతోంది. సంచలన విజయం సాధించిన బలగం సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కమేడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలంగాణ పల్లెటూరి వాతావరణం, అక్కడి భావోద్వేగాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన వేణు.. ఎల్లమ్మ కథను కూడా అంతే హృద్యంగా సిద్ధం చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ లోని సరికొత్త కోణాన్ని తెరపైకి తీసుకురావడానికి వేణు ఎంతో శ్రమించినట్లు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా వీక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. దేవీశ్రీనే అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మోషన్ పోస్టర్‌కు హైలైట్‌గా నిలిచింది.
From MANMADHUDU to MASS to KING... every time they joined forces, history was made💥🔥
— Annapurna Studios (@AnnapurnaStdios) August 2, 2026
The iconic blockbuster combo of King @iamnagarjuna & Rockstar @ThisIsDSP is BACK to set the screens on fire once again❤️🔥
Welcoming Rockstar #DeviSriPrasad on board for #KING100 👑
Wishing… pic.twitter.com/zs4epwEq8P
అక్కినేని నాగార్జున నటిస్తోన్న 100వ సినిమాకు కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీతాన్ని సమకూర్చనున్నాడు. అతని పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ ట్వీట్ ను పోస్ట్ చేసింది.
#Yellamma... and in it a man called PARSHI ❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026
Presenting the ACTOR @ThisIsDSP in a role rooted in the soil with a name you will remember and a journey you will never forget 🔥
We always celebrate his music... Along with that, let's celebrate him on the silver screen too 😍… pic.twitter.com/zLsdRarC5G













Click it and Unblock the Notifications