త్రైపాక్షిక చర్చల వల్లే ఫలితం: హురియత్
న్యూఢిల్లీ: వాస్తవమైన సమస్యను త్రైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించాలని హురియత్ కాన్ఫరెన్స్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కాశ్మీర్ కమిటీకి, పాకిస్థాన్‌లోని కమిటీకి మధ్య చర్చలకు వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ అబ్దుల్ గనీ భట్ తెలిపారు.
త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, అది కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని, ఫలప్రదమైన చర్చల కోసం ఇరు పక్షాలవారిని భాగస్వాములను చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ బలవంతుడని, ముషార్రప్ పాలనలో చర్చలు ప్రారంభమైతే ఫలితాలు ఉండగలవని, ఈ నిజాన్ని అంగీకరించాలని ఆయన అన్నారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయని, ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలు ముఖ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
