ఐఎఎస్‌ రాజీనామా ప్రహసనం

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 05-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: ఐఎఎస్‌ అధికారికె. నారాయణ రాజీనామా వ్యవహారం ఒక ప్రహసనంగా మారింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉద్యమించేందుకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న నారాయణ తాత్కాలిక తన నిర్ణయాన్నివిరమించుకున్నారు.

సచివాలయంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉప కార్యదర్శిగా ఉన్న ఐఎఎస్‌ అధికారి రాజీనామా చేస్తారంటూ మంగళవారం నుంచి ప్రచారం జరుగుతోంది. ఆయనకు మూడేళ్లసర్వీసు ఉంది. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి గానీ,స్వచ్ఛంద పదవీ విరమణకు గానీ అనుమతించాలంటూ నారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖరాశారు. ఆ లేఖను ప్రధాన కార్యదర్శికి అందించారనే వార్త గుప్పుమనడంతో రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేశాయి. ఆయన చేత రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరింపజేయడానికి తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. రాజీనామా నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) నాయకులు ఆయనను అభినందించారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దాకా వెళ్లింది. దీంతో నారాయణ ముఖ్యమంత్రిని కలిశారు. ప్రధాన కార్యదర్శిని కూడా కలిసే ప్రయత్నం చేశారు.

ఈ సమాచారంఅందుకున్న మీడియా ప్రతినిధులు సచివాలయంలోని నారాయణ కార్యాలయానికి వెళ్లారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. తాను ప్రధాన కార్యదర్శిని కలవలేకపోయాయని, దీంతో తన రాజీనామాను సమర్పించలేకపోయానని నారాయణవిలేకరులకు చెప్పారు. రాజీనామా సమర్పించిన అనంతరం నారాయణ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లోవిలేకరులతో మాట్లాడ్తారని భావించారు. దీంతోవిలేకరులు అక్కడ చాలా సేపు నిరీక్షించారు. నారాయణ ఎంతకీ రాకపోవడంతోవిలేకరులు వెళ్లిపోయారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి