కింగ్ నాగార్జున ఫేవరెట్ డిష్ ఇదే.. ఈ ఏజ్‌లో కూడా ఆ ఫిజిక్ కోసం !!
కింగ్ అక్కినేని నాగార్జున.. స్టార్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆరు పదులు వయసు దాటినా కూడా ఫిజిక్ విషయంలో నేటి తరం హీరోలకు పోటీ ఇస్తున్నారు. అందుకే ఆయా ఎక్కడికి వెళ్లినా సరే.. డైట్ సీక్రెట్ ఏంటి ? ఫేవరెట్ ఫుడ్ ఏంటి ?? అంటూ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా తన ఫేవరెట్ ఫుడ్ ఇదే అంటూ నాగార్జున ఓపెన్ అయ్యారు. తనకు హైదరాబాద్ మటన్ బిర్యానీ అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆ టేస్టీ ఫుడ్ రెసిపీ ఎలాగో మీకోసం ప్రత్యేకంగా..
హైదరాబాద్ పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఘుమఘుమలాడే దమ్ బిర్యానీ. అందులోనూ 'హైదరాబాదీ మటన్ బిర్యానీ'కి ఉండే క్రేజ్, రుచి మరెక్కడా దొరకవు. నగరంలోని పాతబస్తీ సందుల నుండి హైటెక్ సిటీలోని ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు, ఎక్కడ తిన్నా ఆ ఘాటైన మసాలాలు భోజన ప్రియులను పరవశింపజేస్తాయి. ప్రతి ఇంటి విందులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మటన్ బిర్యానీ వంటకం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు..
- మటన్: 1 కిలో (ఎముకలతో ఉంటే రుచి మరింత పెరుగుతుంది)
- బాస్మతి బియ్యం: 1 కిలో (30-40 నిమిషాలు నానబెట్టాలి)
- పెరుగు: 1 కప్పు (చిక్కగా)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి: 5-6 (చీల్చినవి)
- ఉల్లిపాయలు: 3 (బిరిస్తా కోసం డీప్ ఫ్రై చేసినవి)
- పొడి మసాలాలు: కారం, పసుపు, బిర్యానీ మసాలా, ఉప్పు
- పుదీనా & కొత్తిమీర: గుప్పెడు
- హోల్ గరం మసాలా: షాహీ జీరా, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు
- ఇతరాలు: నిమ్మరసం, నెయ్యి, కుంకుమపువ్వు పాలు
తయారీ విధానం..
మటన్ ముక్కలను బాగా కడిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, సగం బిరిస్తా, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
పెద్ద గిన్నెలో నీరు మరిగించాలి. అందులో హోల్ మసాలాలు, ఉప్పు వేసి మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేయాలి.
మ్యారినేట్ చేసిన మటన్ ఉన్న గిన్నెలో పైన ఉడికించిన అన్నం ఒక పొరలా పరచాలి.
పైన మిగిలిన బిరిస్తా, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, కుంకుమపువ్వు పాలు చల్లాలి. (కావాలంటే కొద్దిగా గులాబీ నీరు లేదా కేవ్రా వాటర్ వేసుకుంటే హోటల్ స్టైల్ సువాసన వస్తుంది)
గిన్నె మూతను గట్టిగా పెట్టి, ఆవిరి బయటకు పోకుండా పిండితో సీల్ చేయాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకూడదు. 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి.
తర్వాత ఒక పక్కనుంచి నెమ్మదిగా కలుపుతూ సర్వ్ చేయాలి.
మిర్చి కా సాలన్ లేదా రైతాతో తింటే రుచి మరింత పెరుగుతుంది.
అదనపు చిట్కాలు (Extra Tips)..
ఒక స్పూన్ పచ్చి బొప్పాయి పేస్ట్ కలిపితే మటన్ త్వరగా మెత్తబడుతుంది.
కనీసం 4 గంటలు లేదా రాత్రంతా మ్యారినేట్ చేస్తే రుచి రెట్టింపు అవుతుంది.
మటన్ ముందుగా కొంచెం ప్రెషర్ కుక్ చేసి వాడితే టైమ్ సేవ్ అవుతుంది
తక్కువ మంటపై దమ్ చేయడం వల్ల అసలు బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది












Click it and Unblock the Notifications