నక్సల్స్ ఆక్రమణలు చట్టవ్యతిరేకం కాదు: ఎపిసియల్‌సి
హైదరాబాద్: సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్ల భూ ఆక్రమణలు చట్ట వ్యతిరేకం కాదని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ( ఎపిసియల్‌సి) నాయకుడు ప్రొఫెసర్ శేషయ్య అన్నారు. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చల్లో ఆయన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు.
నక్సల్స్ చేపట్టిన భూపోరాటం సమస్య తీవ్రతను తెలియజేస్తోందని ఆయన మంగళవారం విలేకరులతో అన్నారు. ఈ ఆక్రమణల వల్ల చట్టబద్దమైన, చట్టవ్యతిరేకమైన, మిగులు, ఇతర రకా భూముల వివరాలు బయటపడతాయని ఆయన అన్నారు. ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్నదనే మాటల్లో అర్థం లేదని ఆయన అన్నారు. రెండో విడత చర్చలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.











Click it and Unblock the Notifications
