గవర్నర్ల బదిలీలపై యుపిఎపై జయ నిప్పులు
చెన్నై: గవర్నర్ల బదిలీలపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్వల్ప, అర్థరహితమైన కారణాలతో గవర్నర్లను బదిలీ చేయడాన్ని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకపోవడాన్ని ఆమె మంగళవారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా తప్పు పట్టారు.
కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్‌కు ఫోన్ చేసి ఆమె తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తమిళనాడు గవర్నర్‌గా పి.యస్. రామమోహన్ రావు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ల బదిలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం సర్కారియా కమీషన్ సూచనలను విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. గవర్నర్ల బదిలీ, నియామకాల విషయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులను సంప్రదించాలని సర్కారియా కమీషన్ సిఫార్సు చేసింది.











Click it and Unblock the Notifications
