ప్రజాభీష్టం మేరకే తెలంగాణపై నిర్ణయం: కెకె
న్యూఢిల్లీ: ప్రజాభీష్టం మేరకే తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమితుడైన డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. ఆయన మంగళవారం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు.
తెలంగాణ విషయంలో సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ కూడా చెప్పారని, అందువల్ల తెలంగాణపై సమస్య లేదని ఆయన విలేకరులతో అన్నారు. రాష్ట్రావసరాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. నక్సలైట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని, రాష్ట్రంలో శాంతి సాధనకు ఆంధ్రప్రదేశ్ చారిత్రక నిర్ణయం తీసుకుని నక్సల్స్‌తో చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
