ఒరిస్సా అసెంబ్లీలో ఘర్షణ: సియంకు గాయాలు
ఒరిస్సా: రాష్ట్ర శాసనసభలో మంగళవారం జరిగిన ఘర్షణలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గాయపడ్డారు. బాక్సైట్ గునుల విషయంలో ఒక ప్రైవేట్ కంపెనీతో ప్రభుత్వ ఒప్పందంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది.
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉక్కు, గనుల శాఖ మంత్రి పద్మనావ్ బెహెరా సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాల సభ్యులు స్పీకర్ మహేశ్వర్ మొహంతి పోడియం వద్దకు దూసుకెళ్లారు. వారికి వ్యతిరేకంగా అధికార పక్ష సభ్యులు కూడా దూసుకొచ్చారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ పడుతూ ఇరు వర్గాలు ముఖ్యమంత్రి కుర్చీ వైపు తోసుకొచ్చారు. ఈ తోపులాటలో తన ముందున్న డెస్క్ మీద పడడంతో ఆయన గాయపడ్డారు. పట్నాయక్ ఎడమ పాదం డెస్క్ కింద నలిగిపోయింది. కొంత మంది శాసనసభ్యులు వెంటనే పరుగెత్తుకొచ్చి డెస్క్‌ను తొలగించారు. ఆయనను బయటకు తీసికెళ్లారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆస్ప6తికి తరలించారు.











Click it and Unblock the Notifications
