పాఠశాలల్లో తెలుగు బోధన అనివార్యం: రాజ్యలక్ష్మి

హైదరాబాద్‌: మాతృభాష తెలుగును బోధించని ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని ప్రాథమిక విద్యామంత్రి ఎన్‌. రాజ్యలక్ష్మి చెప్పారు. అన్ని పాఠశాలల్లో తెలుగు భాషా బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని, ఈ ఉత్తర్వులను అమలు చేయని పాఠశాల గుర్తింపు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని ఆమె చెప్పారు.

యస్‌సిఇఆర్‌టి సమీక్ష సమావేశంలో ఆమె మంగళవారం పాల్గొన్నారు. సంస్థ పనితీరు పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలకు ఉపాధ్యాయులు చెప్పా పెట్టకుండా గైర్హాజరు అవుతున్న తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తామని ఆమె హెచ్చరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న మాట వాస్తవమేనని, అందుకు తగిన కారణాలున్నాయని, అయితే ఉపాధ్యాయుల గైర్హాజర్‌ ఆందోళనకరంగా ఉన్నదని ఆమె అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+