విపక్షాలను, మీడియాను పట్టించుకోం: వైయస్
న్యూఢిల్లీ: మీడియా వార్తను పట్టించుకోబోమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. మీడియా ఎప్పుడూ తమకు వ్యతిరేకంగానే ఉన్నదని, అందువల్ల మీడియాను పట్టించుకోబోమని ఆయన మంగళవారం విలేకరులతో అన్నారు. న్యూఢిల్లీలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమితుడైన డాక్టర్ కె. కేశవరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేదని ఆయన అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోబోమని, ఎన్ని నిధులు ఖర్చు అయినా సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. నక్సలైట్లను రెండో విడత చర్చలకు త్వరలో ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను కూడా ఆయన కలుసుకున్నారు.











Click it and Unblock the Notifications
