సింగరేణికార్మిక సమ్మె సక్సెస్
హైదరాబాద్:సింగరేణి బొగ్గు గనుల్లో బుధవారంతలపెట్టిన కార్మిక సమ్మెవిజయవంతమైంది. వేతనసవరణ సంఘాన్ని నియమించాలనిడిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఒక రోజుసమ్మెకు పిలుపునిచ్చాయి.
వరంగల్,ఆదిలాబాద్ జిల్లాల్లో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా తొమ్మిది కార్మికసంఘాలకు చెందిన నాయకులనుఅదుపులోకి తీసుకున్నారు. భూపాలపల్లితదితర ప్రాంతాల్లో కార్మికులు సమ్మెలోపాల్గొన్నారు. అయితే సమ్మెపాక్షికంగానే జరిగిందని సింగరేణియాజమాన్యం అధికార ప్రతినిధిచంద్రశేఖర్ అన్నారు. కార్మికులడిమాండ్లు తమ పరిధిలోవి కావనిఆయన అన్నారు. సింగరేణి బొగ్గుగనుల్లో ఉత్పత్తి సజావుగానే సాగిందనిఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ,తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధకార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుతెలిపాయి.











Click it and Unblock the Notifications