కాక మీదున్న సన్‌రైజర్స్ తో కేకేఆర్ క్లాష్: తుదిజట్టులో..

ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తడాఖా చూపుతోంది. భారీ విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా అయిదు విజయాలను తన ఖాతలో వేసుకుంది. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ ను వాళ్ల సొంత గడ్డ వాంఖెడే స్టేడియంలో చితగ్గొట్టడం అదరహో అనిపించుకుంది. ఈ మ్యాచ్ లో ఓడిన దెబ్బకు ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ప్లేఆఫ్స్ పై దాదాపుగా ఆశలు వదులుకున్నట్టయింది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటోంది. గెలవడం ఒక అలవాటుగా మార్చుకున్న ఈ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌ను నిలువరించినప్పటి నుండి దాని దశ తిరిగింది. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి పెద్దగా తెలియని ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చేయడంతో సన్‌రైజర్స్ అయిదు వరుస విజయాలను నమోదు చేసింది. చివరి రెండు విజయాలు 200లకు పైగా లక్ష్యాలను అందుకున్నవే కావడం, పైగా ప్రత్యర్థి గ్రౌండ్ లో దీన్ని సాధించడం హైలైట్.

Powerful Sunrisers Hyderabad Firepowers Sealing Wins Locking Horns with KKR at Eden Gardens Today

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. బ్యాటింగ్ లో అద్భుతమైన ఫామ్‌లో ఉందీ సన్ రైజర్స్. అభిషేక్ శర్మ- 425, హెన్రిచ్ క్లాసెన్ 414 పరుగులు చేసి, బ్యాటింగ్ ఛార్ట్‌లో వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఇషాన్ కిషన్ కూడా 312 పరుగులతో రాణిస్తున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ ఒత్తిడిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

ముంబై ఇండియన్స్‌పై 30 బంతుల్లో అజేయంగా 65 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపిన తీరు క్లాసెన్ సామర్ధ్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ భారీ స్కోర్ చేస్తోన్నప్పటికీ.. నిలకడగా ఆడట్లేదు. క్లాసెన్‌ అలాక్కాదు. ప్రతి మ్యాచ్ లోనూ మినిమమ్ గ్యారంటీతో పరుగులు రాబట్టుకుంటోన్నాడు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ బ్యాక్ బోన్ గా నిలుస్తున్నాడు. బౌలింగ్ లో ఎహసాన్ మలింగ సత్తా చాటుతున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్పటి వరకు సన్ రైజర్స్, కోల్ కత నైట్ రైడర్స్ మధ్య మొత్తం 31 మ్యాచ్‌లు జరిగాయి. వీటిల్లో సన్‌రైజర్స్ 11 గెలిచింది. 20 గేమ్ లల్లో నైట్ రైడర్స్ సత్తా చాటింది. తాజాగా ఈ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌ ఫ్రెండ్లీ పిచ్. ఛేజింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11లో.. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే ఆడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎహసాన్ మలింగ ఆడొచ్చు.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుదిజట్టులో.. అజింక్యా రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (కీపర్), కామెరాన్ గ్రీన్, అంగ్ క్రిష్ రఘువంశీ, రోమన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగికి చోటు దక్కొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+