ఒకే వేదికపై మాజీ భార్యాభర్తలు... సామ్ & చైతూ వీడియో వైరల్ !!
స్టార్ హీరోయిన్ సమంత.. 'ఏ మాయ చేసావే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గానే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఏడడుగులు వేసి కొత్త జీవితం జీవితం మొదలుపెట్టింది. ఇక అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య సైతం ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్ గానే తన ప్రేయసి హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నారు. మరో వైపు తండేల్ మూవీతో భారీ హిట్ కొట్టి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు.
చైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ మాజీ స్టార్ జంట సమంత, నాగచైతన్యలు చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించారు. తమ కొత్త జీవిత భాగస్వాములతో కలిసి రావడంతో ఈ సన్నివేశం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో శనివారం ఘనంగా జరగ్గా, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి ప్రముఖులు హాజరయ్యారు.

అక్కినేని నాగచైతన్య తన తల్లిదండ్రులు నాగార్జున, అమలతో పాటు భార్య శోభిత ధూళిపాళతో ఈ శుభకార్యానికి విచ్చేశారు. కొద్దిసేపటికే, సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి అదే వేదికపై వచ్చారు.
కాగా మాజీ జంట తమ భాగస్వాములతో ఒకే చోట కనిపించడంతో మీడియా దృష్టి, సినీ వర్గాల ఆసక్తి వారిపైనే కేంద్రీకరించింది. వారి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్ర తారల జంటగా వెలుగొందిన సమంత-నాగచైతన్యల బంధం "ఏమాయ చేశావే" సినిమా షూటింగ్‌తో మొదలై, ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, సంతోషంగా ఉన్నారు. ఊహించని మనస్పర్థలు వారు విడిపోవడం జరిగాయి.
వృత్తిపరంగా చూస్తే, సమంత చివరిసారిగా Citadel: Honey Bunny సిరీస్‌లో కనిపించారు. ఈ ప్రైమ్ వీడియో స్పై యాక్షన్ డ్రామాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన పాత్రలో ఆమె ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న Maa Inti Bangaram చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి Nandini Reddy దర్శకత్వం వహిస్తున్నారు. 2026 మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications