వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెదక్ జిల్లాలోరోడ్డు ప్రమాదం:ఏడుగురు మృతి
హైదరాబాద్ : మెదక్‌జిల్లాలో శనివారం తెల్లవారు జామున జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.మరో ముప్ఫై మంది గాయపడ్డారు. వీరంతాకర్నాటకకు చెందిన వారు. యాభై మందితోకూడిన వ్యాన్ శనివారం బీదర్ నుంచిచౌటుప్పల్ వెళుతుండగా ఎదురుగావస్తున్న లారీని ఢీకొంది.
హైదరాబాద్‌కుఅరవై కి.మీ దూరంలో ఉన్న మగ్దుంపల్లిగ్రామం సమీపంలోని జాతీయ రహదారిపైఈ ప్రమాదం జరిగింది. సంఘటనలోఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. డ్రైవర్‌తోపాటు గాయపడ్డ ముప్పై మందిని ప్రభుత్వాసుపత్రికితరలించారు. చౌటుప్పల్‌లో జరిగే ఒకవివాహానికి హాజరు కావడానికి వీరంతావెళుతుండగాఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!