పివి ఆరోగ్యంవిషమం: సుఖ్‌రాం కేసు వాయిదా
న్యూఢిల్లీ:కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్‌పైనున్నఆదాయానికిమించి ఆస్తుల కేసు విచారణను స్థానిక కోర్టుడిసెంబర్ పదికి వాయిదా వేసింది. ఈ కేసులోసాక్ష్యం చెప్పవలసిన మాజీ ప్రధానమంత్రిపి.వి.నరసింహారావు అనారోగ్యం కారణంగావిచారణను కోర్టు వాయిదా వేసింది.
నరసింహారావు ఆరోగ్యం హఠాత్తుగాక్షీణించడంతో ఎయిమ్స్‌కు తరలించామనిఆయన వ్యక్తిగత కార్యదర్శి చీఫ్‌మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రీనా సింగ్ నాగ్‌కుతెలియజేశారు. దీంతో విచారణను న్యాయమూర్తివచ్చే నెల పదికి వాయిదా వేశారు. నరసింహారావు అనారోగ్యంతోబాధపడుతున్నందువల్ల ఆయనసాక్ష్యాన్ని ఆయన నివాసం మోతీలాల్ నెహ్రూమార్గ్‌లోనే రికార్డ్ చేసుకోవాల్సిందనిగతంలోనే న్యాయమూర్తి ఆదేశించారు.ఎనిమిదేళ్ళ క్రితం హమాచల్ ప్రదేశ్‌లోనిసుఖ్‌రామ్ నివాసంపై సిబిఐ దాడులు జరిపిమూడు కోట్ల రూపాయలకు పైగాస్వాధీనపరచుకుంది. అయితే ఆ సొమ్మంతాకాంగ్రెస్ పార్టీ తరఫున సేకరించినవిరాళాలని సుఖ్‌రామ్ చెబుతూ వస్తున్నారు.











Click it and Unblock the Notifications
