భానుమతి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి భార్య భానుమతి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అనంతపురం జిల్లా సెషన్స్ జడ్జి తిరస్కరించారు. భానుమతి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం ఉదయం కోర్టులో వాదనలు ముగిశాయి. ఆ వెంటనే కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. కోర్టు గురువారం సాయంత్రం తన నిర్ణయాన్ని వెల్లడించింది.
పరిటాల హత్య కేసులో భానుమతి పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగించింది. ఈ స్థితిలో ముందస్తు బెయిల్‌కు భానుమతి ఇటీవల పిటిషన్ దాఖలు చేసుకుంది.












Click it and Unblock the Notifications