ఇన్‌ఫార్మర్లతో పేరుతో ఇద్దరిని చంపిన నక్సల్స్
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సలైట్ల హత్యాకాండ కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో నక్సలైట్లు ఇద్దరిని ఇన్‌ఫార్మర్ల పేరుతో హత్య చేశారు. అనంతపురం జిల్లాలో ఒకరిని, మెదక్ జిల్లాలో మరొకరిని నక్సలైట్లు చంపారు. అనంతపురం జిల్లా జె. రామపురంలో వెంకటరాముడు అనే మాజీ నక్సలైటును మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది. ఇతను కొండపల్లి సీతారామయ్య గ్రూపులో దళ సభ్యుడిగా పని చేశాడు.
మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల గ్రామంలో నక్సలైట్లు పోతరాజు సత్తయ్య అనే మాజీ మిలిటెంటును కాల్చి చంపారు. సత్తయ్య ఏడేళ్ల క్రితం మిలిటెంటుగా పని చేశాడు. సత్తయ్య గ్రామంలో ఉంటూ పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడని నక్సలైట్లు ఆరోపించారు.












Click it and Unblock the Notifications