వైయస్ పుత్రుడు జగన్‌ను విచారించిన సిబిఐ
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డిని గురువారం విచారించింది. ముఖ్యమంత్రి నివాసంలోనే ఈ విచారణ అత్యంత రహస్యంగా జరిగింది. ఈ విషయమై అధికారులు నోరు విప్పడం లేదు. పరిటాల హత్య కేసు ఎఫ్ ఐ ఆర్‌లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్న విషయం తెలిసిందే. విచారణకు సంబంధించి సిబిఐ అధికారులు ఇది వరకే జగన్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.
సిబిఐ అధికారులు గురవారం రాయలసీమ ఐజి మీనాను ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఒక అతిథి గృహంలో సిబిఐ అధికారులు ముగ్గురు ఆయనను ప్రశ్నించారు. మంత్రి జె.సి. దివాకర్ రెడ్డిని రేపు విచారించనున్నట్లు సమాచారం. పరిటాల హత్య కేసులో సిబి ఐ అధికారులు పెనుకొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల భానుమతిని ఇదివరకే విచారించారు.












Click it and Unblock the Notifications